Aasara Pension ; కాంగ్రెస్ కు ఓటేయడం మేం చేసిన పాపమా!

Aasara Pension: కాంగ్రెస్ కు ఓటేయడం పాపమా!  కెసిఆర్ ఉసురు మాకు తగిలింది అంటూ పెన్షన్ దారుల  ఆవేదన!

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తి చేసుకొని మరో నాలుగు రోజులు అయితే 8 నెలలు అవుతాయి. కానీ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఎంటయ్యా అంటే శూన్యం! కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఆరు గ్యారెంటీ లను ప్రకటించింది అయితే, ఈ 6 గ్యారంటీలో పూర్తి స్థాయిలో అమలు చేసినవి ఎన్నంటే కేవలం మహాలక్ష్మి పథకంలో ఒక భాగం అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే !

అంటే 6 గ్యారంటీల్లో కనీసం ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని అర్థం. మరి ఎక్కడ అభివృద్ధి జరిగినట్లు ప్రజలకు న్యాయం జరిగిందక్కడ ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి.

అల్సొ రీడ్ : గృహజ్యోతి పథకం 0 బిల్ కోసం ఇదే చివరి అవకాశం! రేవంత్ రెడ్డి. | Griha Jyoti Scheme 0 Bill

గృహజ్యోతి పథకము కింద ఆర్హులైన వారందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. కానీ ఇది కేవలం కొంతమంది కి మాత్రమే అమలులోకి వచ్చింది. తరువాత 500 కే గ్యాస్ సిలిండర్ అన్నారు ఇది కూడా అందరికీ వర్తించలేదు. కారణం ఎంటయ్యా అంటే సవాలక్ష కారణాలు చెబుతున్నారు. దీన్ని అంతటికి కారణం ఎవరు? ప్రభుత్వమే.. ఎందుకంటే దరఖాస్తులు ప్రజల నుంచి తీసుకున్నారు. కానీ వాటిని సక్రమంగా అధికారిక వెబ్సైట్లోకి రిజిస్టర్ చేయలేదు ప్రభుత్వం చేసిన తప్పుకి, కొంతమంది ప్రజలు ఆ పథకానికి అనారులుగా అవుతున్నారు.

ఇక పెన్షన్ విషయానికొస్తే సామాజిక పెన్షన్ ద్వారా ప్రస్తుతం 3000గా ఉన్న పెన్షన్ను ₹4,000గా, వికలాంగులకు 3000 గా ఉన్న పెన్షన్ను 6000 గా  చేసి ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. కానీ 8 నెలలు అయినా ఆ మాట ఊసే లేకుండా పోయింది. కనీసం ఆ రోజు నుంచి ఇస్తామనే మాట కూడా చెప్పటం లేదు. ఏమైనా అంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేదంటున్నారు. అనవసరంగా వృధా ఖర్చులకు వేలకోట్లు కేటాయిస్తున్నారు. కానీ టెన్షన్ దారులకు మాత్రం ఇవ్వడం లేదు!

 ఇక తాజాగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నెల్ల గడవకముందే ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా 3000 పెన్షన్ 4000 కు పెంచుతూ ఈనెల 1వ తేదీన అందరికీ అందజేయడం జరిగింది. ఈ వార్త విన్న తెలంగాణ పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటు వేయడం మేం చేసిన తప్ప అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. . 

నిజానికి టెన్షన్ తీసుకునేవారు చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్లు ఏ పని చేయాలన్నా ఆ పని చేయడానికి సహకరించగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పెంచిన పెన్షన్ వస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాంటివారు ప్రభుత్వం ఇచ్చే ఆసరాలపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. కానీ ప్రభుత్వం వాళ్లపైనే మొండి వైఖరి చూపిస్తుందని మేము అనుకోలేదంటూ ప్రతి పెన్షన్ దారుడు బాధపడుతున్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తను చెప్పినట్టుగా 1000 పెన్షన్ను 2000కు పెంచారని కేసీఆర్ ని గుర్తు చేసుకున్నారు. 

Follow US

Most Popular