TS Ration Card Fake News | రేషన్ కార్డు కోసం ఎదురుచూసే వారికి షాక్!

తెలంగాణ లో రేషన్ కార్డులు లేక గత ఆరు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు అలాగే పిల్లల్ని రేషన్ కార్డులు యాడ్ చేయాలని చూస్తున్నవారు. వీరందరికీ షాక్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని ప్రజాపాలనలను నిర్వహించి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. కానీ ఆ దరఖాస్తులు తీసుకున్నప్పటినుంచి ఇప్పటివరకు వాటి పై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కేవలం త్వరలో రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పడం తప్ప! అది అమలు చేసింది లేదు? ఇప్పటికే ఎనిమిది నెలలు అయింది. ప్రభుత్వం ఏర్పడి కానీ, ఆ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు. కానీ మళ్ళీ త్వరలోనే ఇస్తామని చెబుతూ మంత్రులందరూ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. నిజంగా ఈ రేషన్ కార్డులు వచ్చేటప్పుడు. 

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. రేషన్ కార్డు లో తప్పులు ఒప్పులు సరిచేసుకోవడం కోసం మీసేవలో రేషన్ కార్డ్ అప్డేట్ చేయించుకోవచ్చని వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ తో ప్రజలందరూ మీ సేవకు పరుగులు పెడుతున్నారు దీంతో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలిసేసరికి మోసపోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పందిస్తూ ఇలాంటి ఫేక్ న్యూస్ లో నమ్మొద్దు ఎలాంటి అప్డేట్స్ మేము ఇంకా జారీ చేయలేదు ఇంకో వారం రోజుల్లో చేస్తాం అప్పుడు చెప్పినప్పుడు మాత్రమే మీ సేవకు వెళ్లి మీరు మార్చుకునే అవకాశం ఉంటుందని అందరికీ చెప్పారు. 

Follow US

Most Popular