AP Govt Schemes : ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో ఈ 4 పథకాలు ప్రారంభం!

హాయ్ ఫ్రెండ్స్..

అందరికీ నమస్కారం!

AP Govt Schemes : బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడే అందిన వార్త! ఏపీలో ఈ 4 పథకాలు ప్రారంభం! దీనికి సంబంధించి ఈ 2 పత్రాలు కచ్చితంగా మీ దగ్గర ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ వివరాలను మనం తెలుసుకుందాం.

త్వరలోనే ఈ మూడు పథకాలు ప్రారంభించిన అన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ 4 పథకాలు ఇవే..

AP Govt Schemes

  1. అన్నదాత సుఖీభవ పథకం 
  2. ఆడబిడ్డ నిధి 
  3. తల్లికి వందనం
  4. ఏట 3 ఉచిత సిలిండర్లు.  

AP Govt Schemes: ఈ 4 పథకాలను ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ప్రారంభిస్తారు? ఈ పథకాలకు మనం అర్హత పొందాలంటే మన దగ్గర ఉండవలసిన పత్రాలు ఏంటి? ఈ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం! వీడియోలోకి వెళ్లేముందు ఒక లైక్ చేయండి.  

అన్నదాత సుఖీభవ పథకం గురించి పూర్తి వివరాలు. 

AP Govt Schemes
Annadata Sukhibhava Scheme

అన్నదాత సుఖీభవ పథకము కొత్త పథకమేమీ కాదు. 2014 లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పథకాన్ని తీసుకువచ్చారు.  ఆ తర్వాత 2019లో జగన్ ప్రభుత్వం రైతు భరోసా గా పేరును మార్చి ప్రతి రైతుకు ఆర్థిక సహాయాన్ని అందించింది.  ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ₹6000 ఇస్తుంది. ఈ 6,000 ప్లస్ కొంత మొత్తాన్ని ప్రభుత్వం జోడించి రైతులకు అందజేస్తున్నారు.  

Also Read : రేషన్ కార్డు న్యూ అప్డేట్. | Ration Card New Update

ప్రస్తుతం 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఎన్నికల హామీలో ప్రతి ఒక్క రైతుకు 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000, అదే విధంగా కూటమి ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20 వేల రూపాయలను అర్హులైన ప్రతి రైతుకు అందజేయబోతున్నారు.

అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు? 

ఆంధ్ర ప్రదేశ్ లో చిరుజల్లు లు కురుస్తున్నాయి. అన్నదాతలు వ్యవసాయం కు సంబంధించి పనులన్నీ ఇప్పటికే ప్రారంభించారు. వారందరికీ ఇప్పుడు పెట్టుబడి కి సాయంగా డబ్బులు అవసరం అవుతాయి. ఇలాంటి టైం లో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు వస్తే వారందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది.  అయితే ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించామని దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.  ఈ పథకాన్ని ఎప్పుడూ ప్రారంభిస్తాము అనే దానిపై మరో వారం రోజుల్లో పూర్తి  గైడ్లైన్స్ విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. 

మీకు అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. 

ఆడబిడ్డ నిధి పథకం గురించి పూర్తి వివరాలు.

Free Bus Scheme in AP
Free Bus Scheme in AP

ఆడ బిడ్డ నీది పథకం ద్వారా ప్రతి మహిళకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ లో భాగంగా, చంద్రబాబు ఈ పథకాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఆ పథకాన్ని ప్రారంభించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ఆడబిడ్డ నీది పథకానికి మీరు అర్హత పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆడబిడ్డ నీది పథకం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరం ల వరకు ఉన్న మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతినెల అకౌంట్లో 1500 రూపాయలను జమ చేస్తారు. 

 ఈ పథకం మనకు వర్తించాలంటే మన దగ్గర ఉండాల్సిన పత్రాలు, అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం! 

ఆడబిడ్డ నిధి పథకం కు మీరు అర్హత పొందాలంటే ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న వారై ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ  పథకం వర్తిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి మీ దగ్గర ఉండవలసిన పత్రాలు.. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆడబిడ్డ నీది పథకం దరఖాస్తు ఫారం, అలాగే రెండు ఫోటోలు ఇవన్నీ మీ దగ్గర ఉంటే, ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. 

ఆడబిడ్డ నీది పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ పథకం కు సంబంధించి పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు ప్రభుత్వం వారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు విడుదల చేసిన తర్వాత ఈ ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు దీనికోసం పైన చెప్పిన పత్రాలన్నీ తీసుకొని మీరు సచివాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. 

మీకు ఆడబిడ్డ నీది పథకం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. 

తల్లికి వందనం పథకం గురించి పూర్తి వివరాలు.

Thalliki Vandanam Scheme Details in Telugu
Thalliki Vandanam Scheme Details in Telugu

గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకాన్నిపేరు మార్చి, తల్లికి వందనం పథకంగా కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుంది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థి కి 15వేల రూపాయలను, అందజేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించాలని దీనికి సంబంధించిన కార్యచరణ అంతా సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. 

అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని అంశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అవేంటంటే.. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 అందజేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ కేవలం ఒకరికి మాత్రమే 15,000 ఇవ్వబోతున్నారంటూ.. సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. ఈ విషయంపై విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదని, మార్గదర్శకాలు విడుదల చేసేంతవరకు అలాగే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని, ఇలాంటి అవస్తవాలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. 

అయితే ఈ పథకాన్ని ఎప్పుడూ ప్రారంభిస్తున్నారు అంటే.. జులై ఒకటో 1 తేదీ నే పెంచిన పెన్షన్ 7వేల రూపాయలను అందరికీ అందజేసిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనాపటికి సోషల్ మీడియాలో జరిగే అవస్తవాలను నమ్మకండి. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండండి. 

తల్లికి వందనం పథకం గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి.  

ఏట 3 ఉచిత సిలిండర్లు పథకం గురించి పూర్తి వివరాలు.

Mahashakti Deepam Scheme
Mahashakti Deepam Scheme

 ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరికి శుభవార్త చెప్పారు చంద్రబాబు నాయుడు. దేశంలో గ్యాస్ ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళలందరూ, గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే పరిస్థితి లేదని ఆలోచించి, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లను అందజేస్తామని హామీ ఇచ్చారు.  

ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే అర్హులైన ప్రతిఒక్కరికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం కరసత్తు చేస్తుంది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో 500 కే గ్యాస్ సిలిండర్ను ప్రవేశపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.. అయితే కొంతమేరకు ఆ విధానాలను కూడా కొంత అమలులో తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. 

అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఈ మూడు సిలిండర్లను ఎలా పంపిణీ చేయాలి ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకురావాలి అనే విధివిధానాలు సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి అర్హత పొందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారై ఉండాలి అదేవిధంగా మీకు ఆధార కార్డు ఉండాలి కచ్చితంగా రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం వర్తించదని అధికారులు చెప్తున్నారు ముందుగా మీరు రేషన్ కార్డు ని అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఈ ఉచిత సిలిండర్ల గురించి అప్లికేషన్ పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు.  

మూడు ఉచిత సిలిండర్ ల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. 

ఈ 4 పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు ఈ పథకాలకు సంబంధించి కార్యాచరణ మార్గ దర్శకాలు రూపొందిస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ను మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి.  

Share this post with your friends

Follow US

Most Popular