తెలంగాణ రుణమాఫీ రెండో విడత: ఎవరికీ వస్తుంది, ఎవరికీ రాదు?

తెలంగాణ రుణమాఫీ రెండో విడత వివరాలు మరియు రైతులకు సూచనలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో రుణమాఫీ కార్యక్రమంపై కీలక ప్రకటన చేశారు. ఈ రెండో విడతలో 1,50,000 రూపాయలు మాఫీ చేసే కార్యక్రమం అమలు చేసారు. ఈ రుణమాఫీ పథకం కింద 1,50,000 రూపాయల లోపు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేయనున్నారు. 31 లోగా రుణమాఫీ మొత్తాన్ని అందరి ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

Also Read : అసెంబ్లీ సమావేశాలు: చరిత్రలో తొలిసారి 18 గంటల సమావేశం

రుణమాఫీ అమలు పరిధి: తక్కువ రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించనట్లయితే, సంబంధిత గ్రామ పంచాయతీల్లో లిస్టు విడుదల చేయబడింది. మీ పేరు లిస్టులో లేకపోతే, మీరు చేయాల్సిన చర్యలను ఈ క్రింది విధంగా వివరించారు:

  1. ఆధార్ కార్డు తనిఖీ: మీ ఆధార్ కార్డు వివరాలను మీ వ్యవసాయ శాఖ అధికారికి సమర్పించి, మీకు రుణమాఫీ ఎందుకు వర్తించలేదని తెలుసుకోవాలి.
  2. దరఖాస్తు పత్రాలు సమర్పించటం: మీరు అందించిన సమాచారం మరియు దరఖాస్తులు సరిగ్గా ఉన్నాయా? లెవా? అనేది తెలుసుకోవాలి.

రైతు బీమా:
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ, రైతు బీమా లేని రైతులు ఆగస్టు 5వ తారీఖు లోపు రైతు బీమాకు అప్లై చేయాలని సూచించారు. రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయల బీమా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.

తెలంగాణ రుణమాఫీ రెండో విడత: FAQs:

1. రుణమాఫీ రెండో విడతలో ఎవరికి మాఫీ వర్తిస్తుంది?

1,50,000 రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ రెండో విడత వర్తిస్తుంది.

2. రుణమాఫీ లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలి?

మీ ఆధార్ కార్డు వివరాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి సమర్పించి, రుణమాఫీ సదుపాయం ఎందుకు లేనని తెలుసుకోవాలి.

3. రైతు బీమా కోసం ఎప్పుడు అప్లై చేయాలి?

ఆగస్టు 5వ తారీఖు లోపు రైతు బీమా కోసం అప్లై చేయాలి.

Share this post with your friends

Follow US

Most Popular