Telangana: పట్నం హైవే హెూటల్ యాజమాన్యం దౌర్జన్యం..హోటల్ యాజమాన్యం దాడి..

  • ఐదు మందికి తీవ్ర గాయాలు..! ఒకరి పరిస్థితి విషమం.
  • వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్: కాటా శ్రీనివాస్ గౌడ్

Telangana: సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ పరిధిలో పట్నం హైవే హోటల్ యాజమాన్యం కస్టమర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. విస్తారి బాగాలేదు ఇంకోటి మార్చు అన్న పాపానికి హెూటల్లో భోజనం చేయడానికి వచ్చిన వారిపై హోటల్ యాజమాన్యం, వారి సంబంధికులు దాడికి తెగబడడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారు.

Also Read : ఫ్లై ఓవర్ పైనుంచి క్రింద పడి ప్రమాదం

దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం లక్టారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు భోజనానికి అని వెళ్లినట్లు సమాచారం. అయితే భోజనం ఆర్డర్ చేసిన సమయంలో హెూటల్ సిబ్బంది ఇచ్చిన వీస్తారి బాగాలేదు ఇంకోటి మార్చు అని భోజనం చేయడానికి వచ్చిన వారు అనడంతో మాట, మాట పెరిగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో హెూటల్ యాజమాన్యం భోజనానికి అని వచ్చిన ఆ ముగ్గురిపై దాడికి దిగడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read :  ప్రభుత్వ భూమి కబ్జాలో శ్రీదేవి హెూమ్స్ డెవలపర్స్

ఈ సమాచారం అందుకున్న లక్డారం గ్రామ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి ఆ హెూటల్ కు వెళ్లడంతో ఆయనను సైతం తీవ్రంగా గాయపరిచి జాతీయ రహదారిపై నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుమ్మిగూడిన గ్రామస్తులను తరిమేశారు. విషయం తెలుసుకున్న పటాన్ చేరు కాంగ్రెస్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు సోమవారం ఉదయం పటాన్ చేరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. దానికి పటాన్ చేరు సీఐ ప్రవీణ్ రెడ్డినీ పట్నం హైవే యామాన్యం వారు దాడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పటాన్ చేరు కాన్స్టెన్సీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పట్నం హైవే న్యం దాడులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకొంటామని సీఐ ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు.

Follow US

Most Popular