Telangana: పబ్ లపై నార్కోటిక్ బ్యూరో దాడులు

  • 130 మందికి పరీక్షలు.. ఆరుగురికి నిర్ధారణ

Telangana: పబ్ లపై నార్కోటిక్స్ బ్యూరో ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి దాడులు చేపట్టారు. దాదాపు 25 ప్రాంతాల్లో ఉన్న పబ్ లపై దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి అర్దరాత్రి ఒంటి గంట వరకు పబ్స్ లో దాడులు నిర్వహించారు.

Also Read: RTC స్థల వివాదం – నర్సీపట్నం లో అయ్యన్న పాత్రుడు ఆగ్రహం”

నగరంలోని హైదరబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ దాడులు నిర్వహించారు. కాగా ఆయా పబ్బుల్లో ఉన్న మొత్తం 130 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ఆరుగురికి నిర్దారణ అయిందని తెలిసింది. ఇందులో బంజారాహిల్స్ లోని క్లబ్ రోగ్ పబ్ లో ఒకరు, జోర్ పబ్ లో ఒకరు, జీరో40లో ఇద్దరు, రాయదుర్గం పరిధిలోని విస్కీ సాంబాలోని పబ్ లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటీవ్ నిర్దారణ అయినట్లు తెలిపారు. కాగా డగ్ర్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేజ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేసినట్లు తెలిసింది.

Share this post with your friends

Follow US

Most Popular