Telangana: బాదితులకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం

ప్రభుత్వం పేద ప్రజలు, 59 జీవో బాధితులకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని బొల్లారం పట్టణ బీజేపీ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. జీవో 59 బాధితుల కోసం ఒకరోజు నిరాహారదీక్ష ను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Also Read: వీధీ దీపాలపై జెడ్ సి సమీక్ష

ఎంతోమంది ఆశలతో జీవో 59 కింద ఇళ్లను క్రమబద్దీకరించుకోవడానికి డబ్బులు చెల్లించినా ప్రభుత్వం గతంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. గతంలోనే తాను ఇదే విషయమై పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ద తీసుకోవాలన్నారు.

Also Read: తెలంగాణ రుణమాఫీ రెండో విడత: ఎవరికీ వస్తుంది, ఎవరికీ రాదు?

అర్హులైన వారికి వెంటనే ఇళ్లను క్రమబద్దీకరించి ఇవ్వాలన్నారు. నెల రోజుల్లో గా సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. మేఘన రెడ్డి, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి డి. స్రవంతి రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు జి. రాఘవేంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు శివ లక్ష్మణ్,వి. శ్రీకాంత్ చారి, ప్రధాన కార్యదర్శి అఖిల్,ఓబీసీ మోర్చా అధ్యక్షులు అంబుజ్ పాల్, యువ మోర్చా అధ్యక్షులు యోగి, యువకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Follow US

Most Popular