Telanagana: ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉంటే సహించేది లేదు..

సంగారెడ్డి జిల్లా అర్ధవార్షిక క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా అధికారులకు జిల్లా ఎస్పీ రూపేష్ పలు సూచనలు చేశారు. అర్ధ వార్షిక క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం సంగారెడ్డి నందు జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ రూపేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read: మల్లంపేట్లో…మాది మాఇష్టం.. అడిగేదేవ్యరు ?

ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరస్తులను PT వారెంట్ ద్వారా కోర్టు లో ప్రవేశపెట్టి సైబర్ బాధితులకు భాసటగా నిలవాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో వుండాలని, గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏవిధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనే విషయాలపై తగు సలహాలు మరియు సూచనలు చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ను త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు. 

Also Read: వీధీ దీపాలపై జెడ్ సి సమీక్ష

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ పోర్న్ ఏరియాగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించాలి. ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. నేర నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను చేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకువివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామలలో, ప్రధాన కూడళ్లలో, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. హైవేలు, ప్రధాన కూడళ్లలో, పార్కింగ్ ప్రాంతాలలో, పెట్రోల్ పంపులు, ధాబాల ఎంట్రీ, ఎగ్జిట్ లలో హై రెజల్యూషన్ గల సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసుకునేల సంభందిత యజమానులకుతెలియజేయాలని ఎస్.హెచ్.ఒ. లకు సూచనలు చేశారు. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు వివిధ సంఘాల వారు ముందుకురావాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకుఅందుబాటులో ఉంటూ, ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్, మోసాల గురించిఅవగాహన ర్యక్రమాలునిర్వహించాలన్నారు.

Also Read: “మహిళలకు 1500”, “ఆంధ్రప్రదేశ్ పథకాలు”

ఈ సమీక్షా సమావేశంలో సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చేరు డియస్పి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డియస్పి రామ్ మోహన్ రెడ్డి, నారాయణ ఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఐ.టి. సెల్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్- ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

Follow US

Most Popular