Serilingampally: అందకారంలో నల్లగండ్ల

  • ఐదంస్తుల భవన నిర్మాణం కన్పించకుండా పరదలు
  • కూలిన కర్రలు .. తప్పిన పెను ప్రమాదం.

Serilingampally: ఓ వైపు భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం కాగా.. మరోవైపు నిర్మాదారులు చేపడుతున్న పెద్ద పెద్ద భవనా నిర్మాల వద్ద కూలిన అడ్డు పరదలు, కర్రలతో నల్లగండ్ల అందకారంలోకి మారింది. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో నల్లగుండ్లలో సిటిజన్ ఆస్పత్రి ఎదురుగా ఓ నిర్మాణదారుడు ఐదంస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఆ భవన నిర్మాణం పనులు బయటకు కానరావద్దని కర్రలతో.. పరద కట్టి అడ్డంగా ఉంచారు.

Also Read: భారీ వర్షం..రాకపోకలకు అంతరాయం

అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒకేసారి ఈదురుగాలులకు కర్రలు ఊడి హైటెన్షన్ వైరు తీగలపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం, మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా మొత్తం నిలిచిపోయి అంధకారంలోకి మారింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు చుట్టు పక్కల, భవనం ఆవరణలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. కొందరి అత్యాశల వల్ల సామాన్య ప్రజలు ఇటువంటి విపత్కర సమయాల్లో బిక్కు బిక్కుగా బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిర్మాణం ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడం కేవలం వంద గజాల స్థలంలో నిర్మిస్తున్న ఆ నిర్మాణాన్ని ఐదు అంతస్తులకు పెంచడం కొసమెరుపు అంత తక్కువ విస్తీర్ణంలో.. ఐదంతస్తులు నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ప్రమాదం సంబవించే అవకాశం లేకపోలేదు. నిత్యం జనసంచారం ఉండే ప్రదేశాల్లో నిబందనల మేరకు అనుమతులు ఇవ్వాలి అలా కాకుండా ఇస్తే పరిస్థితులు అదుపు తప్పితే ఇబ్బందులు తప్పవు. ఇటువంటి నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించాలి.

Share this post with your friends

Follow US

Most Popular