Serilingampally : దమ్ముంటే నా ఇంటికి రా లేదంటే నీ ఇంటికి వస్తా..

  • -పాడికౌశిక్ రెడ్డి సవాల్ కు ఎమ్మెల్యే గాంధీ సవాల్..!

Serilingampally : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీకి పీఏసీ ఛైర్మెన్ గా ప్రకటించినప్పటికీ నుంచి ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీకి పీఏసీ ఛైర్మెన్ గా ఎలా నియనిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే గాంధీ మాత్రం తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే ఆయన దేవాలయ కండువా కప్పారని తెలిపారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని స్పష్టం చేశారు. తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని పేర్కొన్నారు. అయితే పార్టీ మారలేదని చెబుతున్న గాంధీ బేషరతుగా బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని, లేదంటే తామే వచ్చి ఆయనకు పార్టీ కండువా కప్పి గాంధీ ఇంటిపై గులాబీ జెండా ఎగరవేస్తామని హజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

Also Read: పార్టీ ఫిరాయింపులపై హై కోర్టు సంచలన నిర్ణయం

తాజాగా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గాంధీ స్పందించారు. దమ్ముంటే తన ఇంటికి రావాలని, లేదంటే తానే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు. గురువారం ఎట్టి పరిస్థితుల్లో గాంధీ ఇంటికి వస్తామని అనడంతో గతరాత్రి నుంచే వివేకానందనగర్ కాలనీలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే లపై అనుచిత వ్యాఖ్యలతో పాటు శేరిలింగంప ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ ఇంటిపై జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కొండాపూర్ లోని నివాసంలో ఆయనను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this post with your friends

Follow US

Most Popular