Serilingampally : భారీ వర్షం..రాకపోకలకు అంతరాయం

Serilingampally : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాంతాలన్నీ జలాశయాలను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ వరద ఉధృతి తో ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శేరిలింగంపల్లిలోనూ భారీ వర్షానికి ఆయా ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి కింద నుంచే వెళ్లే వెళ్లాల్సిన దారిలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమై వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

Also Read: ఈర్ల చెరువు పరిధిలో ఇళ్ల కూల్చివేత

హెచ్చరిక కోసం అక్కడక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింద డ్రైనేజీ ఉధృతంగా పొంగిపొర్లుతుంది. దీంతో అధికార యంత్రాంగం ఇరువైపులా నుంచి వాహనాదారులు ఎవరు రాకుండా దారి మళ్లించి నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు. అయితే ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని వాహనదారులు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు

Share this post with your friends

Follow US

Most Popular