2 లక్షల రుణమాఫీకి ముందు, రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదు. | Ration Card New Update Telangana 2024

Ration Card New Update Telangana 2024: గత 10 సంవత్సరాలుగా తెలంగాణాలో రేషన్ కార్డు ఇవ్వక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డు అందరికి అందిస్తామంటూ, ప్రజాపాలనలు నిర్వహించి దరఖాస్తులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ 6 నెలలైనా ఆ దరఖాస్తులు అటే పోయినాయి, కానీ మనకు రేషన్ కార్డు మాత్రం ఇవ్వలేదు.

Also Read ; Indiramma House Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకం | లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.  

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎందుకు ఇవ్వడం లేదు. 2లక్షల రుణమాఫీ చేసిన తరువాత రేషన్ కార్డు ఇస్తామని ఎందుకు అంటున్నారు. అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అయితే దీనికి సంబందించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియో తెలుసుకుందాం!

మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఇలాంటి అప్డేట్స్ వచ్చిన ముందుగా మీరే తెలుసుకోవచ్చు. 

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వటంలేదు? ఇస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? 

Ration Card New Update Telangana 2024 |రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వటం లేదు?

ముందుగా మనం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకుందాం! 

ప్రజలందరూ రేషన్ కార్డులు లేక తమకు రావలసిన పథకాలను పొందలేక పోతున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదంటే ప్రభుత్వ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం  రాష్ట్రంలో వేలకొద్ది నకలీ రేషన్ కార్డులు ఉన్నాయని వాటిద్వారా అనర్హులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధి పొందుతున్నారని, వారిని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు.

నిజానికి ఈ ప్రక్రియ చేయాలంటే త్వరగా నే చేయొచ్చు. కానీ కావాలనే ఆలస్యం చేస్తుంది.

ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? 

ధన నష్టం: కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు రేషన్ సరఫరా పెరుగుతుందని, దీంతో సబ్సిడీల వల్ల ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుంది.

నకిలీ కార్డుల వల్ల నష్టం: నకిలీ రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీలు పొందడం, ప్రభుత్వ ఖర్చు పెరుగుతుంది.

2 లక్షల రుణ మాఫీ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ రెండు లక్షల రుణ మాఫీ చేస్తామన్న సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే రేవంత్ రెడ్డి దీన్ని సవాల్ గా తీసుకుని ఆగస్టు 15 లోగా ప్రతి రైతుకు 2 లక్షల రుణ మాఫీ చేస్తానని సవాల్ చేశారు. 

Also Read : రూ. 2 లక్షల రుణమాఫీ – కటాఫ్ తేదీలు మరియు ఇతర వివరాలు | rythu runa mafi telangana status

2 లక్షల రుణమాఫీ కావాలంటే ఆ రైతుకు కచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుందని, రేషన్ కార్డు ని ప్రమాణంగా పెట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా రేషన్ కార్డు ఉన్నవారందరికీ రుణమాఫీ చెయ్యవలసి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం దగ్గర రైతు రుణమాఫీ చేయడానికి మరింత డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ అయినా తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది . అని ప్రజలందరు భావిస్తున్నారు. 

మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. 

Follow US

Most Popular