N Convention – HYDRA Effect : N కన్వెన్షన్ కూల్చివేతను స్వాగతిస్తున్నాం

  • కన్వెన్షన్ తో వచ్చిన కిరాయి సొమ్మును రికవరీ చేయాలి
  • మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్- రెడ్డి పెద్ద భూ మాఫియా
  • ఆక్రమణలను తొలగించాల్సిందే.
  • సీపీఐ కార్యదర్శి నారాయణ

N Convention – HYDRA Effect : పేదొడు కాసింత గుడిసె వేసుకుంటే కూల్చేసే ప్రభుత్వాలు.. పెద్దల భూ మాఫియాకు గత ప్రభుత్వం అండగా నిలిచాయని. రేవంత్ రెడ్డి సర్కారు ఆద్వర్యంలో ఏర్పాటు అయిన హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం హైడ్రా ఆద్వర్యంలో కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ప్రాంతాన్ని పరిశీలించారు.

Also Read: నాకు వ్యతిరేక వార్తలు రాస్తే తాటతీస్తా!టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాస్ లకే బాస్ బిగ్ బాస్ హీరో నాగార్జున అని చమత్కరించారు. ఎఫ్టిఎల్ పరిధి దాటి బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలిసినా హీరో నాగార్జున యదేచ్చగా ఎన్ కన్వెన్షన్ నిర్మించుకున్నారన్నారు. గతంలోనే తాము ఈ నిర్మాణం పై సమగ్ర విచారణ చేయాలని విన్నవించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కొందరు పెద్దలుగా చలామణి అవుతూ చెరువు ప్రాంతాలను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.

రోజు రోజుకు అన్యక్రాంతం అవుతున్న భూములు, చెరువులు, కుంటల కోసం అనేకసార్లు ఆందోళనలు చేశామని తెలిపారు. మూడు ఎకరాల్లో హీరో నాగార్జున కబ్జా చేసి కన్వెన్షన్ కట్టారని రోజుకు లక్షల్లో సంపాదించిన సంపన్నుడని తెలిపారు. నాగార్జున బిగ్ బాస్ కే బాస్ అంటూ చమత్కరించారు. హైదరబాద్ చుట్టు పక్కల భూముల, చెరువుల రక్షణ కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలను ఆయన స్వాగతించారు. అయితే నాగార్జున కన్వెన్షన్ మీద ఎంత సంపాదించారో దానినంతా రికవరీ చేసి పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇంకా అనేక మంది భూ మాఫియా వారు ఉన్నారన్నారు. కబ్జా స్థలాలు, చెరువుల్లో కళాశాలలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పెద్ద భూ మాఫియాదారులన్నారు. కాగా ఎన్ కన్వెన్షన్ వివాదం స్టే లో ఉందంటూ సినిమా హీరో నాగార్జున సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. నిజ జీవితంలో సినిమా డైలాగులు పనికిరావన్నారు.

Also Read: కెసిఆర్ ని కలిసినందుకే ఈ కూల్చివేత! రేవంత్ రెడ్డి పై నాగార్జున సంచలన కామెంట్స్.

అయితే ఈ అక్రమ కూల్చివేతలు రాజకీయ కక్షపూరితంగా ఉండకూడదన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా కూల్చివేయాలన్నారు. ఎందుకంటే ఇలా చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే ఊర్లకు ఊర్లే మునిగిపోతాయన్నారు. అలాగే నోటరీ ద్వారా స్థలాలలను అమ్ముతున్నారని అటువంటి వాటి పట్ల ప్రభుత్వం చొరవ చూపి నష్టపోకుండా చూడాలన్నారు. కబ్జాలు, దొంగ పట్టాలు పొందిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే అక్రమ నిర్మాణాలపై ఎవరు అనుమతి ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి అధికారుల భరతం పట్టాలన్నారు. కోర్టు వ్యవస్థలో మార్పు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, న్యాయం అందరికీ సమానమేనని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎంత పెద్ద పలుకుబడి కలిగిన నాయకుడైన కబ్జా చేస్తే కూల్చివేయాలన్నారు. కోర్టులు కూడా సంవత్సరాల పాటు కేసుల్లో జాప్యం చేయద్దన్నారు. హైడ్రా ఆరంభం అదరగొట్టి..ఆగిపోవద్దని కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. పేదల పక్షాన, అక్రమాలపై సీపీఐ మొదటి నుంచి పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ పేదల పక్షమేనని ఆయన అన్నారు. అక్రమాలు, కబ్జాలు చేసి కోర్టుకు వెళ్లడం సిగ్గు చేటన్నారు

Share this post with your friends

Follow US

Most Popular