Madhapur: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గరు ఇంజనీరింగ్ విద్యార్థులు..

  • పట్టుకున్న డీటీఏఫ్ బృందం

Madhapur: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా… డ్రగ్స్ దందా ఆగడం లేదు. ప్రభుత్వం తెలంగాణ ను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి సారించింది. అయినప్పటికీ డ్రగ్స్ ముఠా ఆగడాలు ఆగడం లేదు‌. ఏదో రూపంలో యదేచ్చగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా మాదాపూర్ లో గురువారం డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గుర యువకులను డీటీఎఫ్ బృందం అరెస్టు చేసింది.

Also Read:  గచ్చిబౌలి లో రేవ్ పార్టీలోయువతీయువకులు

కాగా సదరు ముగ్గరు యువకులు ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం. కాగా వీరు మాదాపూర్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ విద్యార్థులు 30 ఎల్ ఎస్ డీ డ్రగ్స్ స్ట్రిప్ లను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా వారి వద్ద నుంచి 70 వేల విలువ చేసే డ్రగ్స్ తో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఇంజనీరింగ్ చదువుతున్న చైన్నైకి చెందిన చరణ్ తేజ్ తో పాటు కౌశిక్, సయ్యద్ లు ఉన్నట్లు తెలిపారు. కాగా వీరు చైన్నై నుంచి డ్రగ్స్ ను నగరానికి తీసుకువచ్చి విద్యార్థుల కు సరఫరా చేస్తున్నట్లు డీటీఏఫ్ అదికారులు తెలిపారు. మరో వ్యక్తి సరపరాజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉందని వారు తెలిపారు.

Follow US

Most Popular