Hyderabad Real Estate: పటేల్ నగర్ లో రియల్

Hyderabad Real Estate: మనిషి ఆశలను అవకాశంగా మలుచుకుంటూ కోట్ల రూపాయలు దండుకోవడం కొత్తేం కాదు. అటువంటి అనేక సంస్థలు పుట్టగొడుగుళ్లా పుట్టుకొచ్చి ఆశ చూపడం.. రాత్రికి రాత్రి బోర్డు తిప్పేయడం లాంటి సంఘటనలు ఏదో చోట జరుగుతున్నా ప్రజలు గుడ్డిగా నమ్మడమే మోసగాళ్లకు ఆసరా అవుతుంది. ఫలితంగా అందమైన ప్రకటనలు.. అతి సులువే కదా అనుకునేలా ప్రకటనలు చేయించి కోట్ల రూపాయలు నింపుకొని వందలాది మందిని రోడ్డు పాలు చేస్తున్నారు. అటువంటి సంఘటనే కూకట్‌పల్లి లో ఓ రియల్ భారీ మోసం చోటు చేసుకుంది. బాదితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కూకట్‌పల్లి లోని సర్దార్ పటేల్ నగర్ లో వీవోఎన్ ఇన్ ప్రా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థ ఎం.డి కె. సురేష్, మార్కెటింగ్ ఎండి.గా వంశీకృష్ణ చౌదరి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఛార్జిగా ఎ.వెంకటేష్ లు కలిసి ఏర్పాటు చేశారు. అయితే తమ వద్ద 30 ఎకరాల్లో భూమి ఉందని ఒక గుంటకు కేవలం 5 లక్షలు మాత్రమేనంటూ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అయితే ఒక గుంట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి 25 నెలలు ఆగితే అసలు తో పాటు నాలుగు శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. అయితే వినూత్నంగా ఆలోచించిన రియల్ వ్యాపారుల మోసాన్ని బాదితులు పసిగట్టలేకపోయారు. అసలు భూమి ఎక్కడుందో కూడా తెలవకుండా చూడకుండా మీ పేర్ల మీద ఒక గుంట రిజిస్ట్రేషన్ చేస్తామని బదులుగా 5 లక్షలు చెల్లించాలి.

Also Read : రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

ఆ తరువాత 25 నెలల కాలానికి సదరు రియల్ ఎస్టేట్ సంస్థ తిరిగి వారి భూమిని వారి పేరున తీసుకొని బాదితులు ఇచ్చిన 5 లక్షల అసలుతో పాటు నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తామని ఒకవేళ అలా లేకుంటే ఆ ఒక గుంట భూమి మీకేనంటూ ప్రచారం చేశారు. ఆ అందమైన ప్రచారమే వారి కొంపముంచింది. కోట్ల రూపాయలు జమ చేసుకొని రాత్రికి రాత్రే బోర్డు తిప్పే శారు. అత్యాశకు పోయి మోసపోయంటూ వందల సంఖ్యలో బాదితులు బయటపడుతున్నారు. మోసపోయమని గ్రహించి కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు.

Share this post with your friends

Follow US

Most Popular