Hyderabad: రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

  • తెలుగు మీడియం రెస్టారెంట్ లో తనిఖీలు
  • యాజమాన్యానికి షోకాజ్ నోటీసు, రెస్టారెంట్ పై కేసు నమోదు.

Hyderabad: హైదరబాద్ లో ఆకట్టుకునేలా పుట్టగొడుగుళ్లా హోటళ్లు, రెస్టారెంట్లు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నోరూరించే వంటల పేరుతో ఆకట్టుకునే పోస్టర్లతో భోజన ప్రియుల ఆకలిని ఆసరాగా చేసుకొని వారి అనారోగ్యాలకు పలు రెస్టారెంట్లు కారణం అవుతున్నాయి. అయితే బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయంటూ.. ఓ కస్టమర్ జూబ్లిహిల్స్ లోని తెలుగు మీడియం రెస్టారెంట్ పై ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం జూబ్లీహిల్స్ లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు.


ఈ సందర్భంగా కాలం చెల్లిన పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెస్టారెంటులో ప్రిజ్ లో నిల్వ ఉంచిన చికెన్, మటన్ లను కనుగొన్నారు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తెలుగు మీడియం రెస్టారెంట్ పై కేసు నమోదు చేశారు. ఆ రెస్టారెంట్ యాజమానికి పోకాజ్ నోటీసు అందజేశారు. కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గత సోమవారం నుంచే ముమ్మరం చేశారు. తెలంగాణ ఆఫ్ ఫుడ్ సేఫ్టీకి చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు వరుస దాడులు చేపట్టారు.


రోజుల తరబడి ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించినట్లు వారు తెలిపారు. గడువు తీరిన పలు ఆహార పదార్థాలను ఆయా రెస్టారెంట్లలో వినియోగిస్తున్నారని తెలిపారు. అలాగే ఆహార పదార్థాలు సంబందిన వాటిపై లేబుళ్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:  హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్

అలాగే ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నట్లుగా గుర్తించారు ఈ క్రమంలో ఆయా రెస్టారెంట్లపై కేసులు నమోదు చేశారు. కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులను బట్టి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లపై వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ప్రజా ఆరోగ్యలతో చలగాటం ఆడే ఇటువంటి రెస్టారెంట్లపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి.

Share this post with your friends

Follow US

Most Popular