Hyderabad: సెల్లార్లకు అనుమతులు ఇవ్వొద్దు….?

  • ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకునే అవకాశం.
  • ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండనుందో…!

Hyderabad: హైదరబాద్ నగరంలో ఇకపై సెల్లార్లకు అనుమతు ఇవ్వొద్దనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విన్పిస్తున్నా చివరకు ఎలా నిర్ణయం ఉండనుందో అనేక ఉత్కంఠ అటు రియల్టర్లు, బిల్డర్లలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి ఆయా కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే వాటి అంతటికి కారణం చెరువులు, కుంటలు కబ్జా చేయడం ఒకటైతే మరోటి సెల్లార్లతో కూడిన భవన నిర్మాణాలు అదికంగా నిర్మించడం వల్ల వరద ఉధృతి ప్రకోపంగా రోడ్డును ముంచెత్తడంతో పాటు జలాశయాలను తలపించాయి. పార్కింగ్ కోసం కొన్ని భవనాలలో రెండు నుంచి ఐదు అంతస్తుల వరకు నిర్మిస్తుంటారు. కమర్షియల్ బిల్డింగ్ లో ఈ రకమైన నిర్మాణాలు ఉంటాయి. దీని వలన వరదనీరు చేరి అనేక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. సెల్లార్ల నిర్మాణానికి లోతుగా తవ్వాల్సి రావడం తవ్వి తీసిన మట్టి కూడా సమస్యగా మారింది. అయితే ఆయా నిర్మాణాలు, ఈ తరహ నిర్మాణాల వల్ల భవిష్యత్తు లో భూ కంపాలు సంభవించే అవకాశమూ ఉంది. పలువురు ఇంజనీర్లు సైతం ఇటువంటి నిర్మాణాలు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అయితే సెల్లార్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదనే భావనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు

        సాధారణంగా పార్కింగ్ కోసం సెల్లార్లను ఉపయోగిస్తుంటారు. సెల్లార్లు లేకుంటే పార్కింగ్ సమస్య ఎదురవుతుంది. దీని కోసం పార్కింగ్ కోసం పలు అంతస్తులు వదిలి వేయడం వల్ల ఎన్ని అంతస్తులకైనా అనుమతి ఇవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ లో అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గరిష్ఠంగా మూడు స్టిల్టుల వరకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.  

   నివాస సమూదాయంలో నిర్మాణంలో ఈ విధానాన్ని బిల్డర్లు స్వాగతించినా కమర్షియల్ భవనాల నిర్మాణంలో ఆసక్తి చూపడం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ కు డిమాండ్ చాలా ఎక్కువ అని అలాంటిది గ్రౌండ్ ఫ్లోరును వదిలేస్తే నష్టపోవాల్సి వస్తుందనే భావనలో బిల్డర్లు ఉన్నారు. అయితే ఈ విధానం పై ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సిన అవసరం  ఉంది.

Share this post with your friends

Follow US

Most Popular