Gachibowli: గచ్చిబౌలి లో రేవ్ పార్టీలోయువతీయువకులు

  • అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Gachibowli : హైదరాబాదు లోని గచ్చిబౌలి లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. కాగా రేవ్ పార్టీలో గంజాయి, తదితర మద్యం, మత్తు పదార్థాల ను స్వాధీనం చేసుసుకున్నట్లు వారు తెలిపారు. అయితే గచ్చిబౌలి లోని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీ కి పలువురు సినీ పరిశ్రమలోని ప్రముఖులు హాజరై నట్లు తెలిపారు. అయితే గంజాయి, ఈ సిగరెట్లను విచ్చలవిడిగా వినియోగించారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు దాడులు చేసి మొత్తం 18 మంది యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు

కాగా ఇందులో ఆరుగురు యువతులు ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషను లో అప్పగించినట్లు తెలిపారు.

Share this post with your friends

Follow US

Most Popular