Gachibowli: ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

  • మరో ముగ్గరుకి గాయాలు.
  • యువతిని పొడిచి ఆత్మహత్యకు యత్నం

Gachibowli :ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించాలంటూ .. వేదించడంతో పాటు తనను నిరాకరిస్తుందనే అక్కసుతో ఓ యువతిపై దాడి చేసిన సంఘటన గచ్చిబౌలి పరిధిలో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనలో సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందగా… దాడిని ప్రతిఘటించిన యువతి స్నేహితిరాళ్లు ముగ్గరు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబందించిన వివరాలు స్థానికులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ 25 నగరానికి వచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ని గోపన్ పల్లి తండా సమీపంలో తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటూ నల్లగండ్ల అపర్ణలో బ్యూటీషియన్ గా పని చేస్తుంది. ఆమెకు గత కొంతకాలం నుంచి కర్ణాటక కు చెందిన రాకేష్ తో పరిచయం ఏర్పడింది. అయితే రాకేష్ తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేదిస్తూ వస్తున్నాడు. కాగా సదరు యువతి పెళ్లికి నిరాకరిస్తూ వస్తుంది.

Also Read: ఖరీదైన ఫోన్లను కాజేసిన డెలీవరి బాయ్

అయితే బుదవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్ ఆమెతో మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది. కాగా రాకేష్ కోపంతో కత్తి తో సదరు యువతిపై దాడి చేశారు. దాడిని అడ్డుకోవాలని ప్రతిఘటించిన యువతి స్నేహితులకు సైతం గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుండి పారిపోఉఇన రాకేష్ మొయినాబాద్ సమీపంలో కనకమామిడి వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. విద్యుత్ స్తంబం ఎక్కడానికి ప్రయత్నించే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై గాయాలపాలయ్యాడు‌. స్థానికుల సమాచారంతో పోలీసులు కనకమామిడి సమీపంలో ని ఆస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this post with your friends

Follow US

Most Popular