Gachibowli #Jayabheri #Muralimohan #Hydra : మేమే కూల్చేస్తాం ..హైడ్రా అవసరం లేదు

  • స్పందించిన సినీ నటుడు మాగంటి మురళీమోహన్

Gachibowli Hydra : బఫర్ జోన్ పరిధిలోకి వచ్చిన షెడ్డును మేమే కూల్చివేస్తామని హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం లేదని సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబందించిన జయభేరి కన్ స్ట్రక్షన్ కు సంబందించిన నిర్మాణం పై ఆయన స్పందించారు. జయభేరి సంస్థ నిర్మాణం బఫర్ జోన్ లో ఉందని స్థానిక అధికారుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు ఆ సంస్థకు నోటీసులు అందజేశారు.

Also Read: పటేల్ నగర్ లో రియల్

గచ్చిబౌలి లోని రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్ లోకి వస్తుందని అధికారులు తెలిపారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై సినీనటుడు మురళీమోహన్ ఆదివారం స్పందించారు. హైడ్రా రావాల్సిన అవసరం లేదని మేమే స్వయంగా అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం షెడ్డు కూల్చివేస్తామని తెలిపారు.

Also Read: సున్నం చెరువు కబ్జాల కూల్చివేత

33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని తెలిపారు. బఫర్ జోన్ లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్లు ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారని ఆ కూల్చివేతలకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం సాయంత్రం లోగా ఆ షెడ్డును తామే కూలుస్తామని స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు తమ సైట్ కు వచ్చారని ఆయన తెలిపారు.

Share this post with your friends

Follow US

Most Popular