Gachibowli Care Hospital: గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో మృతదేహానికి చికిత్స

  • సినిమాను తలపించిన వైనం
  • డబ్బుల కోసం వైద్యుల కక్కుర్తి

Gachibowli Care Hospital: డబ్బుల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని దారులను కొందరు యదేచ్చగా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇచ్చే దవాఖానాలు కూడా అందుకు సిద్దమవుతున్నాయి. బతుకు మీద ఆశతో రోగంతో చికిత్స కోసం దవాఖానాకు వెళ్తే.. కాపాడాల్సిన వైద్యులే .. పైసల కోసం ప్రాణాలను తీస్తున్నారు.

Also Read:వాలంటీర్లకు షాక్ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఎంత కష్టమైనా వైద్య సేవలతో నిలపాల్సిన ప్రాణాలను అలా చేయకుండా .. కాసుల కోసమే కాసుకొని చూస్తున్నారు. కొన్ని ప్రైవేటు దవాఖానాలు కూడా డబ్బుల కోసం మనుషుల ప్రాణాలను లెక్క చేయలేదు. దవాఖానాకు వచ్చిన రోగికి చికిత్స చేసి బతికించాల్సిన వైద్యులు .. చనిపోయిన మృతదేహనికి వైద్యం చేస్తున్నట్లు వ్యవహరించి లక్షలు వసూలు చేసిన అమానవీయ ఘటన గచ్చిబౌలి లోని కేర్ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది.

Also Read: టిడిపి ఎమ్మెల్యే తో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి డాన్స్

సంఘటనకు సంబందించిన వివరాలు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన వెంకటేష్ (50) అనారోగ్యం తో కేర్ ఆస్పత్రిలో చేరారు. కాగా గత శుక్రవారం వెంకటేష్ కు వైద్యులు శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సమయంలో 5లక్షల 50 వేలు చెల్లించాలని మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. అంతా బాగవుతుందని అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నయం అవుతున్నాడని అనుకుంటున్న బందువులకు వైద్యులు షాక్ ఇచ్చారు.

Also Read:అంత్యక్రియలకు వి.వి.ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

తమ వ్యక్తిని చూసే అవకాశం ఇవ్వండి అని ఎన్నిసార్లు అడిగినా గత రాత్రి నుంచి ఆస్పత్రి సిబ్బంది వారిని అడ్డుకున్నారని తెలిపారు. ఆస్పత్రి వైద్యుల తీరుపై అనుమానం వచ్చిన ట్లు తెలిపారు. అయితే మరో 4 లక్షలా 50 వేలు చెల్లిస్తేనే చూడడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. దీంతో వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఐసీయు అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా వెంకటేష్ అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.

Also Read:పరవాడలో వీధి కుక్కలు పట్టివేత

వెంకటేష్ మృతి చెందిన విషయాన్ని దాచి డబ్బుల కోసం సినీ ఫక్కీలో కేర్ ఆస్పత్రి దవాఖానా వైద్యులు ఇంతటి అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. రాష్ట్ర రాజదాని నగరంలో కార్పోరేట్ దవాఖానాలో కాసుల కోసం.. ఇలా మరెంత మంది అమాయకులు బలవుతున్నారో. ఇప్పటికైనా సంబందిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని వెంకటేష్ బంధువులు డిమాండ్ చేశారు.

Follow US

Most Popular