Chandhanagar:ఖరీదైన ఫోన్లను కాజేసిన డెలీవరి బాయ్

  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • అదుపులో డెలీవరి బాయ్

Chandhanagar: ఓ కొరియర్ లో డెలీవరి బాయ్ గా పని చేస్తున్న సదరు వ్యక్తి ఖరీదైన పది ఐ ఫోన్లను కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన చందానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ కంపెనీ పది ఫోన్ల ప్యాకేజితో కూడిన కొరియర్ చేసింది. దానిని సదరు అడ్రస్ కు తీసుకెళ్లి అప్పజెప్పాల్సిన డెలీవర్ బాయ్ వాటిని అప్పచెప్పకుండా మాయం చేసే ప్రయత్నం చేశారు. కాగా ఆర్డర్ చేసిన ప్యాకేజీ జాప్యం కావడం తదితర అనుమానాలతో కంపెనీ ప్రతినిధులు సదరు డెలివరీ బాయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సంబందిత డెలీవరి బాయ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చందానగర్ సీఐ పాలవెల్లి వివరించారు.

Share this post with your friends

Follow US

Most Popular