Asara Pension Telangana:పెంచిన పెన్షన్..! తెలంగాణలో కూడా ఇంటి దగ్గరికే!

ఆసరా పెన్షన్లు తీసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వారు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారో..  అదే మాదిరిగా తెలంగాణలో కూడా ఈ విధానాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ దారులకు తీపికబురు చెప్పింది. 

అదేవిధంగా ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం పెంచిన పెన్షన్ నేకాకుండా ప్రకటించినప్పటినుంచి మూడు నెలల పెంచిన పెన్షన్ కలిపి మొత్తం 7వేల రూపాయలను జూలై ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది. అదే తరహా లో తెలంగాణలో ఉన్న పెన్షన్ దారులు కూడా మాకు పెన్షన్ ప్రకటించినప్పటినుంచి ఒక్కో 1000  చొప్పున 8000 అలాగే ఈనెల పెంచిన పెన్షన్ 4000 కలిపి మొత్తం 12000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read ; Aasara Pension ; కాంగ్రెస్ కు ఓటేయడం మేం చేసిన పాపమా!

పెంచిన పెన్షన్ ఎప్పుడిస్తారు? ఏపీలో మాదిరిగా తెలంగాణ లో ఇస్తారా? ఈ విషయాలన్ని మనం ఈ వీడియో లో తెలుసుకుందాం! చాలామంది వీడియో చూస్తున్నారు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన ముందుగా మీరే తెలుసుకోవచ్చు. అలాగే ఈ విషయాన్ని మరి కొంత మందికి తెలియజేయండి. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎన్నికల హామీలో ఇచ్చిన పెన్షన్ పెంపు ఇంకా జరగలేదు. పెంచిన పెన్షన్ ను ఎప్పుడు ఇస్తారు అని పెన్షన్ దారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ మాట ఊసే ఎత్తడం లేదు. పక్క రాష్ట్రమైన ఏపీలో నెలగడవకముందే పెంచిన పెన్షన్ ని ఇంటి దగ్గరికి తెచ్చి ఇచ్చారు కానీ తెలంగాణలో పెన్షన్ దారులను పట్టించుకునే నాథుడే లేడు. 

Also Read : Indiramma House Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకం | లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.   

ఎన్నికల ముందు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నిజానికి ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం ఐదు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేశామని చెప్పుకుంటున్నారు. ఇదంతా వాళ్ళు చెప్పుకోవడం మాటికి కానీ నిజానికి ఎక్కడ జరిగింది లేదు ఈ విషయం తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. 

అటు ఫంక్షను పెంచక ఇస్తున్న పెన్షన్ను తీసుకోవడానికి పెన్షన్ దారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆంధ్రాలో ఇంటి దగ్గరికి తెచ్చి ఇచ్చినట్టుగా, తెలంగాణలో కూడా తెచ్చి ఇస్తే బాగుంటుంది అని, పెన్షన్ దారులు వేడుకుంటున్నారు. కానీ ఆ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగానే ఉంది. ఎందుకంటే పెన్షన్ దారుల గురించి మాట్లాడే మంత్రులె లేరు.  

తెలంగాణలో పెంచిన పెన్షన్ ని అమలు చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. 

దివ్యాంగుల పెన్షన్ 4016 నుండి 6000 లకు పెంచాలి మరియు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు 2016 ల నుండి 4000 లకు పెంచాలి, అదే విధంగా ప్రతి నెల 5వ తేది లోపు ఇవ్వాలి.

 దివ్యాంగులకు ఆర్.టి.సి బస్లలో ఉచిత ప్రయానం కల్పించాలంటూ ప్రధాన డిమాండ్లతో మంద కృష్ణ మాదిగ సభ నిర్వహించబోతున్నారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కచ్చితంగా చెప్పండి.

Follow US

Most Popular