ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: కీలక ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయం పై కీలక ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం!

ఆసరా పెన్షన్: పింఛన్ పెంపు మరియు ప్రారంభం

"ఆసరా పెన్షన్ పథకం వివరాలు"
NTR Bharosa Pension Scheme Full Details

ఏపీ ఎన్నికల భాగంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హత కలిగిన ప్రతి రేషన్ కార్డుకి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సిఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా 5 పథకాలపై తన మొదటి సంతకాల ను చేసి వాటిని అమలు చేసే దిశగా అర్హత మొదలుపెట్టారు. ఇప్పటికే ఆసరా పెన్షన్ లో భాగంగా పెంచిన పెన్షన్ 4000 గా ఇస్తూ జులై ఒకటో తారీఖున ప్రారంభించారు.

ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల ప్రారంభం

"ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల ప్రారంభం"

దాని తర్వాత మరికొన్ని పథకాలను ప్రారంభించేందుకు ఆ పథకాలకు సంబంధించిన విధి విధానాల గురించి కరసత్వం మొదలు పెట్టారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు అందించాలని, ఆగస్టు 15వ తారీఖున అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 100 క్యాంటీన్లు మొదటి విడతలో ప్రారంభించాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

దీపం పథకం: ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు మరిన్ని పథకాలు

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం"
Mahashakti Deepam Scheme

దీంతోపాటు మరికొన్ని పథకాలు కూడా ఆగస్టులో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పథకాలలో దీపం పథకం కు సంబంధించి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండలను ఇచ్చే పథకం. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రెండు పథకాల గురించి అధికారిక ప్రకటన రాకపోయినా, అధికారులు చెప్తున్నదాన్ని ప్రకారం ఆగస్టులో ఈ పథకాలను అలాగే, అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించబోతున్నారు.

ప్రభుత్వ హామీలు: సూపర్ సిక్స్ పథకాలు

Annadata Sukhibhava Scheme
Annadata Sukhibhava Scheme

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ లను ప్రకటించారు. అయితే ఆ సూపర్ 6 పథకాలను ప్రారంభించాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఖజానాలో తగినంత బడ్జెట్ లేకపోవడం ద్వారా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ అధికార వర్గాలు వెల్లడించారు. అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించి ఆర్థిక మొత్తాన్ని కొంతమేరకు సమకూర్చినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో సమకూర్చిన తర్వాత ఈ పథకాలను, పూర్తిస్థాయిలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్] : link to official website

FAQs:

Q1: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

A1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నది. అధికారిక తేదీ ఇంకా ప్రకటించబడలేదు.

Q2: ఆసరా పెన్షన్ ఎంతవరకు పెంచబడింది?

A2: ఆసరా పెన్షన్ ప్రస్తుతం 4000 రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు.

Q3: అన్న క్యాంటీన్లు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి?

A3: ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి.

Q4: ఈ పథకాలు ఎవరికీ వర్తిస్తాయి?

A4: ఈ పథకాలు అర్హత కలిగిన రేషన్ కార్డ్ దారులకు మరియు ఇతర అర్హులకే వర్తిస్తాయి.

Share this post with your friends

Follow US

Most Popular