Amangal: జల్సాలకు డబ్బు చాలక దొంగతనాలకు పాల్పడిన నిండుతులు

  • సోలార్ ప్లాంటు లో వైర్లు అపహారణ
  • పోలీస్ లకు దొరికిన నిందితులు

Amangal: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు, ఆమనగల్లు సిఐ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. వజ్రగిరి సత్యరాజు, వజ్రగిరి మధు కలిసి మేడిగడ్డ తాండ శివారులో జూలై 20న సోలార్ ప్లాంట్ లో సుమారు రూ, 10 వేలు విలువగల వైర్లు దొంగిలించారని పిర్యాదు వచ్చింది. దాంతో కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు, జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోక నిండుతుల కుటుంబ సభ్యులు జట్టుగా ఏర్పడి దొంగతనాలు చేసి సంపాదించాలని నిర్ణయించుకొని వ్యవసాయ బోర్ మోటార్లు దొంగిలించి అందులో ఉన్న కాపర్ వైర్లు అమ్మి వచ్చిన డబ్బులు సమానంగా పంచుకునేవారు.

Also Read:  నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఇలా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో సోలార్ కరెంట్ తయారయ్యే ప్లాంట్లలో కాపర్ వైర్ చోరీ చేసేవారు, జులై నెలలో మేడిగడ్డ శివారులో గల సోలార్ ప్లాంట్ లో 10 వేలు విలువగల వైర్లు దొంగలించారు, నిందితులో పట్టణ కేంద్రంలోని సేవాలాల్ గుట్ట వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నారు, నిందితులను విచారించగా ఈ మూట గతంలో మొత్తం తొమ్మిది దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని మిడ్జిల్ పిఎస్ పరిధిలో నాలుగు కల్వకుర్తి అడ్డాకల్ చిన్నచింతకుంట మక్తల్ పీఎస్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు, నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అమనగల్ తలకొండపల్లి ఎస్ఐలు వెంకటేష్,శ్రీకాంత్ కానిస్టేబుల్ శివకుమార్, రఘు జాషువా లను సిఐ అభినందించారు

Follow US

Most Popular