కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు: రేవంత్ రెడ్డి దుష్టుడు, కౌశిక్ రెడ్డిపై దాడికి న్యాయపోరాటం

రేవంత్ రెడ్డి దుష్టుడు..
-హైదరబాద్ ప్రజలపై పగబట్టిండు
-ఫిరాయింపులపై ప్రశ్నిస్తే దాడులా
-హింసాత్మక దాడులకు ప్రేరేపిస్తున్నడు
-ప్రజల తరుఫున కొట్లాడుతూనే ఉంటాం
-కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిందే : కేటీఆర్

KTR Pressmeet, #Sherilingampally : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్టుడు అని దుష్ట సంస్కృతి కి తెరలేపాడని అది తెలంగాణ కు మంచిది కాదని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం కొండాపూర్ లోని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పరామర్శించడానికి వెళ్లారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీ, ఆయన అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు.

Watch Live: KTR visits Padi Kaushik Reddy Residency | Press Meet 

అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన అందరికీ స్వేచ్చ ఉంటుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని అవి అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్ అని మండిపడ్డారు. ప్రశ్నించిన ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరిపించిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేతగాక డిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్నాడన్నారు. ఓ వైపు హైదరబాద్ లో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు.

అయితే ఇటీవల పార్టీ ఫిరాయింపులపై తాము న్యాయపోరాటం చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. అందులో భాగంగా హై కోర్టు నాలుగు వారాల గడువుతో అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ నోటీసు ఇచ్చిన రోజే ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాందీ కి పీఏసీ పదవి అప్పజెప్పడం సిగ్గు చేటన్నారు. అదే విషయమై కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం లేక సహనం కోల్పోయి బజారు భాషతో బూతులు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే లను రాళ్లతో కొట్టండి అంటూ హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారన్నారు. అయినా తాము ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి న్యాయ పోరాటం చేస్తుంటే ఓర్వలేకపోతున్నాడన్నారు.

      శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాందీని కలవడానికి వెళ్తామని చేస్తే కౌశిక్ రెడ్డిని ఇంట్లో నిర్భందించి అరికెపూడి గాందీ, ఆయన అనుచరులను

స్వేచ్చగా వదిలి పోలీసు ఎస్కార్టులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడికి పాల్పడేలా చేశారన్నారు. ఎక్కడికక్కడ తమ బీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే ల వరకు నిర్భందించడం సిగ్గు చేటన్నారు. అయితే హైదరబాద్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి కి చాలా కోపం ఉందన్నారు. అందుకే హైడ్రా పేరుతో సామాన్యుల బతుకులను బజారుకీడుస్తున్నాడన్నారు.

Also Read : serilingampally: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో హరీష్ రావుకు చికిత్స

హైదరాబాద్ లో ప్రజలు సంపూర్ణంగా బీఆర్ఎస్ వైపు ఉండడం నచ్చక ఓ వైపు హైడ్రా మరో వైపు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాడన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ప్రాంతీయ విద్వేషం సంఘటన చోటు చేసుకోలేదని తెలిపారు. మేం గేట్లు తెరిస్తే అంతా ఖాళీ అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎక్కడున్నాడని విమర్శించారు.

      పాలన చేతగాక అసహనంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈ సంస్కృతి మంచిది కాదన్నారు. అయినా రేవంత్ రెడ్డి సర్కారును ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం పేదల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందన్నారు. అలాగే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు పడేలా న్యాయ పోరాటం చేస్తామన్నారు. 
ఇప్పటికే ముగ్గరిపై ఇచ్చిన అనర్హత ఫిర్యాదుపై హైకోర్టు స్పందించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగతా వారిపై కూడా వేటు వేసేలా న్యాయ పోరాటం చేస్తామన్నారు.  కౌశిక్ రెడ్డిపై పోలీసుల అండతో దాడికి పాల్పడిన అరికెపూడి గాందీతో పాటు ఇంకెవరూ ఉన్నా వారందరిపై శిక్ష పడేలా పోరాటం చేస్తామన్నారు.

(FAQs)

1. కేటీఆర్, రేవంత్ రెడ్డిపై ఏమని వ్యాఖ్యానించారు?

కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి దుష్ట సంస్కృతికి తెరలేపారని, అది తెలంగాణకు మంచిది కాదని అన్నారు. ప్రశ్నలు ఎదుర్కొనేందుకు తట్టుకోలేని సీఎం అని, హింసాత్మక చర్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.

2. కేటీఆర్ కౌశిక్ రెడ్డిని ఎందుకు పరామర్శించారు?

కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. ఈ దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

3. కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడికి కేటీఆర్ ఎలా స్పందించారు?

కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి హింసాత్మకంగా ప్రేరేపించబడినదని, దాడికి పాల్పడిన వారు శిక్షించబడాలని తెలిపారు. అరికెపూడి గాందీ, ఆయన అనుచరులు దాడిలో పాల్గొన్నారని ఆరోపించారు.

4. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేటీఆర్ ఏం చెప్పారు?

కేటీఆర్, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తామని, హైకోర్టు ఇప్పటికే నాలుగు వారాల గడువుతో నోటీసు ఇచ్చిందని చెప్పారు. పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు.

5. రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ విమర్శలేమిటి?

కేటీఆర్, రేవంత్ రెడ్డి పాలన చేతగాని వ్యక్తి అని, ప్రజల తరఫున ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

Follow US

Most Popular