Telangana: పార్టీ ఫిరాయింపులపై హై కోర్టు సంచలన నిర్ణయం

  • -స్పీకర్ కు నాలుగు వారాల గడువు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ కు నాలుగు వారాల గడువు ఆయన ముందు ఉంచింది. నాలుగు వారాల్లో నిర్ణయం వెలువరించకుంటే తామే సుమోటోగా తీసుకోవాల్సి వస్తుందనే నిర్ణయం తెలంగాణ రాష్డ్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఎమ్మెల్యే ల అనర్హతపై హై కోర్టు అసెంబ్లీ సెక్రటరీ కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల గడువు ఇచ్చింది.

Also Read : హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్

అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి, కేపి. వివేకానంద గౌడ్ కు పిటిషన్ వేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా తెలంగాణ హై కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

Follow US

Most Popular