Ayyappa society #Hydra : సున్నం చెరువు కబ్జాల కూల్చివేత

  • ఆదివారం ఉదయమే రంగంలోకి హైడ్రా

Ayyappa society #Hydra: హైదరబాద్ నగరంలో ఆక్రమణలకు అంతు లేదు.. రాజకీయ నాయకుల అండనో నీతి లేని అధికారులో… అవినీతి మరిగిన ఉన్నతాధికారులో సామాన్యుని ఆశతో ఆడుకునే కబ్జా రాయుళ్లో పాపం ఎవరిదైనా… నీళ్లతో కళకళలాడే చెరువులన్నీ మెల్ల మెల్లగా కబ్జాకు గురైన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, చెరువులు, కుంటలను మాయం చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై దృష్టి సారించి అక్రమమని తేలితే కూల్చివేతలు చేస్తుంది.

Also Read: పటేల్ నగర్ లో రియల్

అందులో భాగంగా హైడ్రా ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల్లో ఎంత పెద్దలు, పలుకుబడి వారు ఉన్నా వదిలేది లేదంటూ దూకుడుగా వెళ్తుంది. అందులో భాగంగా శేరిలింగంపల్లి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఒక్కసారి ఝలక్ ఇచ్చింది. ఆదివారం ఉదయమే రంగంలోకి దిగి… అక్రమ నిర్మాణాలను కూల్చవేస్తుంది. శేరిలింగంపల్లి, బాలానగర్ పరిధిలోని సున్నపు రాయి చెరువులో కబ్జా చేసిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. సున్నం చెరువు గతంలో 26 ఎకరాలలో విస్తరించి ఉంది. కాగా ఈ చెరువు చాలా కాలంగా కబ్జాకు గురవుతూ వస్తుంది. అయితే 2013లో అధికారులు ఈ చెరువు సర్వే చేశారు. అయితే ఆ సమయంలో 15.23 ఎకరాల్లో నీరు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కాగా హెచ్ఏండీఏ సైతం 4805 గుర్తింపు నెంబరును ఇచ్చింది. కాగా చెరువు ఎఫ్టీఏల్ పరిధిలో సర్వే నెంబరు 13, 14, 16 ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వే నెంబర్లలోనే బఫర్ జోన్లు ఉన్నాయి. అయితే సున్నం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ను నిర్దారిస్తూ 2014లోనే ప్రాథమిక ప్రకటన జారీ చేశారు. హెచ్ఏండీఎ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్దారించిన ఎఫ్టీఎల్ పరిధికి అధికారులు కంచెను ఆ సమయంలోనే ఏర్పాటు చేశారు. కబ్జాదారులు కొందరు ఆ కంచె ఫెన్సింగ్ ను ముందుకు జరపగా మరికొందరు ఏకంగా పూర్తిగా తొలగించి కబ్జా కు పాల్పడ్డారు.

Also Read: రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

సర్వే నెంబరు 13, 14లో చెరువు భూమి లేకుండా చేశారు. ప్రస్తుతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 16పై కొందరి కబ్జా రాయుళ్ల కన్ను పడింది. కాగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో రోడ్లు నిర్మాణాలు చేయాలని గత ప్రభుత్వం లో చూశారనే ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం అల్లాపూర్ రెవెన్యూ పరిదిలోకి వచ్చే ఈ చెరువు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గుంట్లబేగంపేట్ లోనూ కొంత ఉంటుంది. అయితే రెండు జిల్లాల యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో యదేచ్చగా కబ్జాకు గురైంది. కాగా గత ఏడాదే ఈ చెరువు ఆక్రమణపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా శేరిలింగంపల్లి పరిధిలోనూ హైడ్రా ప్రత్యేక నజర్ సారించడంతోనే మొదటగా సున్నం రాయి చెరువు కబ్జాల కూల్చివేతలను ప్రారంభించింది. మరింత సూక్ష్మంగా దృష్టి సారిస్తే .. ఆక్రమణలు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు చర్చిస్తున్నారు.

Follow US

Most Popular