Telangana: ఎన్ కన్వేన్షన్ ను కూల్చిన హైడ్రా

  • అంగుళం కూడా ఆక్రమించలేదు నాగార్జున
  • న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడి.

Telangana: హైదరబాద్ నగరంలో అక్రమ కట్టడాలు, నిర్మాణాలను కూల్చడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా అక్రమ భవనాలు, చెరువులు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు చేసి నిర్మించిన కట్టడాలను గుర్తించి ప్రభుత్వం ఆద్వర్యంలో కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. అందులో బాగంగా టాలీవుడ్ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను శనివారం అధికారులు కూల్చివేశారు. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించిన మూడు ఎకరాల్లో నిర్మాణం ఉందని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదు మేరకు పక్కా ఆదారాలు సేకరించి హైడ్రా కూల్చివేతకు పాల్పడింది. తెల్లవారు జాము నుంచే అధికారులు కూల్చివేత ప్రారంభించారు

Also Read: అన్ స్టాపబుల్ 3 మొదటి గెస్ట్స్ గా రేవంత్.

అంగుళం కూడా ఆక్రమించలేదు : హీరో నాగార్జున

.ఎన్ కన్వెన్షన్ లో ఎలాంటి అక్రమం లేదని హీరో నాగార్జున అన్నారు. కూల్చివేత పై ఆయన స్పందించారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం భాదాకరమన్నారు. తాను అంగుళం కూడా ఆక్రమించలేదని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ భూమి పట్టా భూమి అని తెలిపారు. అధికారులు చేసిన చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన నోటీసుతో కోర్టుకు వెళ్లామని కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కేసు కోర్టులో ఉండగా ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు. కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే తానే దగ్గరుండి కూల్చేవాడినని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వివరించారు

Follow US

Most Popular