KTR: రేవంత్ రెడ్డి కి పథకాలు అమలు చేయడం చేతకాదు!

రేవంత్ రెడ్డి కి పథకాలు అమలు చేయడం చేతకాదు! సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..

రేవంత్ రెడ్డి ముందు ఆరు గ్యారెంటీ లు అమలు చెయ్యి లేదంటే దిగిపో.. కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ను వరసగా మీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇది కాదు నువ్వు చేయవలసింది ప్రజలకి ఇచ్చిన హామీలను నిలబెట్టు అంటూ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయాలన్నీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తావించారు. అసలు మేము ఢిల్లీకి ఎందుకొచ్చామంటే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అలాగే BRS పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేషం.. ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.ktr warning in revanth reddy

గ్యారెంటి కూడా పూర్తిగా అమలు కాలేదు!

అలాగే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమ్ములు చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి. కానీ నిజానికి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఈ వాస్తవాన్ని అందరు తెలుసుకోవాలని ప్రజలందరూ ఈ విషయం గురించి ఆలోచించాలని కోరారు. అలాగే రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదురైతుబంధు నీ రైతు భరోసాగా చేసి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కానీ అది కూడా అమలు చేయలేదు. ఆసరా పెన్షన్ కింద 2000 ఉన్న పెన్షన్ ని 4000 చేస్తామన్నారు. ఆ పథకాన్ని కూడా ఇంకా అమలు చేయలేదు.

నీకంటే ఏపీ సీఎం చంద్రబాబే నయం

నీకంటే ఏపీ సీఎం చంద్రబాబు నయం, చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీని జూలై 1 నుంచే పెంచిన పెన్షన్ను అందరికీ ఇంటింటికి వెళ్లి అందజేశారు కానీ తెలంగాణలో పెంచిన పెన్షన్ అందక ముసలి వాళ్లు తాతయ్యలు రోడ్డును పడ్డారు ధర్నాలు చేస్తున్నారు అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : TS Ration Card Fake News | రేషన్ కార్డు కోసం ఎదురుచూసే వారికి షాక్!

ఇప్పటికైనా పెంచిన ఆసరా పెన్షన్ అమలు చేసి, ఫంక్షన్ దారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు కేటీఆర్.

Follow US

Most Popular