కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఎలా చేయాలి? How to Apply for New Ration Card AP

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోని వారికి శుభవార్త ! రూల్ మారింది.

హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం!  మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను కొత్త రేషన్ కార్డుని ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అప్లికేషన్ ఎవరికి అందించాలి? 

ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వివరాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా డౌట్స్ అడుగుతున్నారు. వారికి నేను ఏమి చెప్పలేను! మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకవేళ అప్పటికి అర్ధం కాకపోతే తర్వాత కింద కామెంట్లో అడగండి. వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.  

Also Read : కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఎలా చేయాలి? How to Apply for New Ration Card AP

అలాగే ప్రభుత్వ పథకాలనుంచి వచ్చే అప్డేట్స్ అందరికంటే ముందుగా పొందాలంటే… మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తెలియని వారికి మీ వాట్సాప్ గ్రూపు లో షేర్ చేయండి.  

కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? 

మీరు కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు దరఖాస్తు ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఎక్కడుంటుంది. మీ సేవలోనా! అయితే అక్కడికి వెళ్లాలా? అవసరం లేదు! మీ మొబైల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర కంప్యూటర్ ఉంటే అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

దరఖాస్వం డౌన్లోడ్ చేసుకోవడం కోసం ముందుగా మీరు గూగుల్ కు వెళ్ళండి అక్కడ AP new ration card registration అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి అప్పుడు మీకు చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి అందులో కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీసేవ అఫీషియల్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది.  దాని క్రింద న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని మీకు కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. 

దాన్ని క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ మీకు రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫామ్ మీకు కనిపిస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.  

డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిరాక్స్ సెంటర్ కి వెళ్లి ప్రింట్ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇస్తారు.  

దరఖాస్తు ఫామ్ తీసుకొని ఆ దరఖాస్తు ఫామ్ లో ఏ వివరాలు అడుగుతున్నారో ఆ వివరాలన్నిటిని మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి.  

Follow US

Most Popular